Thursday, October 7, 2010

చిన్నారి ' నిరీహ' పాడిన శ్రీరాజరాజేశ్వరి పాట

దసరా శరన్నవరాత్రుల ప్రారంభం కానున్న తరుణంలో, చిన్నారి 'నిరీహ ' పాడిన శ్రీరాజరాజేశ్వరి పాట వినండి.




Sunday, June 20, 2010

ఒక అద్భుతమైన నాన్న పాట,మా నిరీహ గొంతులో..

మా అమ్మాయి గొంతులో “నాన్నా అను పదమే”…-ఫాదర్స్ డే సందర్భంగా ఇచ్చిన కానుక.




నాన్నా అను పదమే.. నాదసుధారసమై
నడిపించును జీవితం
నవరస భరితం… నవరస భరితం

చిటివ్రేలు పట్టి లోకచిత్రాలే చూపించు
తప్పటడుగులే దిద్ది సత్పధాల నడిపించు
జిలిబిలి ఆటలలోనే జీవితాశయాలు నింపి
ఇంతింతై ఎదుగువేళ..ఎంతెంతో మురిసిపోవు.. నాన్నా ..

తనయుడె తన జీవమని.. తనకే సర్వస్వమని
కనులముందు తన రూపే.. కదలాడుట భాగ్యమని

తలమునకలు వేయునంత
తనకొకింత దూరమైన
తల్లడిల్లి తపియించే
తండ్రికి వేరెవరు సాటి .. నాన్నా ..

హితమై జీవితమై
మహిత మార్గదర్శకమై
ఉపదేశామృతమై
ఉజ్వల భవితవ్యమై

సఖుడై గురుడై జనకుడె
స్వాచార్యదేవుడై
సతము సుతుని నీడయై
చల్లని దీవెనలనిచ్చు.. నాన్నా.

Tuesday, January 19, 2010

అరుదుగా కనపడే (వినపడే) సరస్వతీ ప్రార్ధన శ్లోకం… సరస్వతీ పూజ సందర్భంగా బ్లాగ్మిత్రులకి…

అరుదుగా కనపడే (వినపడే) సరస్వతీ ప్రార్ధన శ్లోకం… సరస్వతీ పూజ సందర్భంగా బ్లాగ్మిత్రులకి

శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీమ్

వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహామ్

హస్తేస్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితామ్

వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్


–యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.