Sunday, June 20, 2010

ఒక అద్భుతమైన నాన్న పాట,మా నిరీహ గొంతులో..

మా అమ్మాయి గొంతులో “నాన్నా అను పదమే”…-ఫాదర్స్ డే సందర్భంగా ఇచ్చిన కానుక.




నాన్నా అను పదమే.. నాదసుధారసమై
నడిపించును జీవితం
నవరస భరితం… నవరస భరితం

చిటివ్రేలు పట్టి లోకచిత్రాలే చూపించు
తప్పటడుగులే దిద్ది సత్పధాల నడిపించు
జిలిబిలి ఆటలలోనే జీవితాశయాలు నింపి
ఇంతింతై ఎదుగువేళ..ఎంతెంతో మురిసిపోవు.. నాన్నా ..

తనయుడె తన జీవమని.. తనకే సర్వస్వమని
కనులముందు తన రూపే.. కదలాడుట భాగ్యమని

తలమునకలు వేయునంత
తనకొకింత దూరమైన
తల్లడిల్లి తపియించే
తండ్రికి వేరెవరు సాటి .. నాన్నా ..

హితమై జీవితమై
మహిత మార్గదర్శకమై
ఉపదేశామృతమై
ఉజ్వల భవితవ్యమై

సఖుడై గురుడై జనకుడె
స్వాచార్యదేవుడై
సతము సుతుని నీడయై
చల్లని దీవెనలనిచ్చు.. నాన్నా.