Thursday, January 17, 2008

'ఒక్క మగాడు ' చిత్ర సమీక్ష..

  • ఒక చిత్రం విజయవంతంగా ఆడటానికి లేదా ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవడానికి మధ్య వుండేది..సునిశితమైన,సున్నితమైన విభజన రేఖ మాత్రమే...
  • ' ఒక్క మగాడు ' చిత్ర దర్శకుడు వై.వి.యస్.కు పెద్దగా సినిమాలు చూసే అలవాటు లేకపోవడమైనా అయ్యుండాలి...లేదా తనకు బాగా నచ్చిన రెండు,మూడు సినిమాల ప్రభావం...తీస్తున్న సినిమాపై పడటమైనా అయ్యుండాలి...

  • చిత్రంలో స్థూలంగా కనిపించే కొన్ని పాత చిత్రాలు..
  • 1.సర్దార్ పాపారాయుడు
  • 2.జస్టిస్ చౌదరి
  • 3.భారతీయుడు
  • 4.అపరిచితుడు
  • సిమ్రాన్ మేకప్ బొత్తిగా బాలేదు...ఏదో కార్టూన్ సీరియల్ లో ముసలమ్మ బొమ్మ లాగా వుంది... నటన అంతంత మాత్రమే...
  • అనుష్క కొంత వయ్యారాలను వలక పోసినా...కాస్త ఆయిల్ మేకప్ టచ్ యివ్వటం వల్లనేమో అంత అందంగా కనిపించలేదు... నటించటానికి పెద్దగా అవకాశం యివ్వలేదు...
  • ఇకపోతే నిషా కొఠారి అందచందాలు ప్రేక్షకులకు నచ్చకపోగా...నటన స్కోపే లేదు... అస్సలు నిషా కొఠారి సినిమాలో వుందా అనిపించే విధంగా క్యారెక్టర్ మాయమయిపోయేటట్లు దర్శకుడు ఎందుకు చేయాల్సి వచ్చిందో...
  • విలన్ నంబూద్రి పాత్రధారి విభూతి ధారణ బాలేదు...ఆ పాత్రకు మనవాడు కుర్రవాడయిపోయాడు..
  • ఒక్క కామెడీ బిట్ కూడా పెట్టకపోవడం ప్రధాన లోపం.
  • ఏం చూస్తున్నామో...ఎందుకు చూస్తున్నామో కూడా తెలియనంతగా,ఏదో గుంభనంగా సాగిపోయింది మొదటి భాగం...
  • కొద్దిగా కధతో కాస్త సెకండ్ హాఫ్ ఏదో నయమనిపించాడు...పాపం దర్శకుడు
  • డైలాగులు సామాన్య ప్రేక్షకుడికి ఎట్టి పరిస్థితుల్లో అర్ధం కావు..ప్రతి డైలాగు రెండు రకాలుగా ట్విస్ట్ వచ్చేటట్టు పెడితే పాపం ప్రేక్షకులు మాత్రం ఎన్నని ఓపిగ్గా విని అర్ధం చేసుకుంటారు..
  • కాకపోతే " పెదవి తాకని మాటకు రాజువు నువ్వు..పెదవి దాటిన మాటకు బానిసవు నువ్వు " వంటివి కొన్ని బావున్నాయి.
  • ఫైట్స్ ఫర్లేదు..సాంగ్స్ అంతగా నచ్చవు..డాన్స్ ఏమీ బాలేదు..
  • పెద్ద బాలకృష్ణ లో ఒక జస్టిస్ చౌదరి,స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో ఒక సర్దార్ పాపారాయుడు కనిపిస్తాడు.
  • screen play బాగాలేకపోవడం వల్ల సినిమా కుదేలయిపోయుండొచ్చు..
  • అపరిచితుడు లాగా స్టేడియం లో ప్రత్యక్షమవ్వడం..భారతీయుడు లాగా అన్యాయాన్ని సహించలేకపోవడం..మనకు తెలిసిన సీన్లే...
  • వెరసి చిత్రానికి నేనిచ్చే మార్కులు పదికి మూడు.
  • ఆ మూడులో ఒకటి బాలకృష్ణ నటనకు(అది కూడా బాలకృష్ణ మాత్రమే నటించడానికి తీసిన సినిమా కావడం వల్ల)
  • రెండు మార్కులు...
    అద్భుతంగా చిత్రీకరించిన మొదటి పాటకు..
    అద్భుతంగా సంగీతం కూర్చిన మొదటి పాటకు..
    అద్భుతంగా రాసిన మొదటి పాటకు...
    ఇహ సినిమాకు వెళ్ళటం..వెళ్ళకపోవటం మీ ఇష్టం..
    వై.వి.సత్యనారాయణ

2 comments:

GKK said...

సమీక్ష బాగుంది.

mohanraokotari said...

cast feeling tho cinemaalu thisthe anthe baasu