కదలాడేటి కల కరుగనీకుమా
కనుమూసి తెరచే లోపుగా.. నువ్వు కన్నుమరుగైపోకుమా...
అనుకోని రీతిలో ఎదుటపడిన నీతో మాటలే నాకు రావులే
అచ్చెరువొకింత సంభ్రమము కలగలిసిన స్థాణువైపోతినే
దరి చేరరావోయి ప్రియతమా
కదలాడేటి కల కరుగనీకుమా
కనుమూసి తెరచే లోపుగా.. నువ్వు కన్నుమరుగైపోకుమా...
ఉబికినచో అస్పష్టమగునని మిన్నకుంటివేమో కనులు
ఎన్నేళ్ళ కన్నీళ్ళు క్షణకాలములో చన్నీళ్ళుగా మారిపోయెనే
దరి చేరరావోయి ప్రియతమా
కదలాడేటి కల కరుగనీకుమా
కనుమూసి తెరచే లోపుగా.. నువ్వు కన్నుమరుగైపోకుమా...
అడుగులు భారమై విడివడి నడచిన ఆ వేళలో నా కనులకు
అరుణిమ దాల్చిన నీ రూపమేతప్ప మరియొకటి కనపడదులే
దరి చేరరావోయి ప్రియతమా
కదలాడేటి కల కరుగనీకుమా
కనుమూసి తెరచే లోపుగా.. నువ్వు కన్నుమరుగైపోకుమా...
--యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
3 comments:
బాగుందండి.
రాధిక గారూ..మీకు ధన్యవాదాలు..
ఎన్నో ఏళ్ళ క్రితం కలిసి.. మరలా అనుకోకుండా కనిపించిన ప్రియురాలిని చూసి సంభ్రమాశ్చర్యాలతో నోరు పెగలని పరిస్థితి..మొదటి చరణంలో..
ఎదురుగా కూర్చోని వున్నప్పుడు...ఎప్పటినుండో సలసల కాగుతున్న కన్నీళ్ళు..చప్పున చల్లారటం..అదీ ప్రియురాలి ముఖం కనపడదేమో అనే ఆవేదన..రెండవ చరణంలో..
వీడ్కోలు తీసుకుని వెళుతున్న క్షణాన్ని తెలిపేది ..మూడవ చరణంలో..
ఇకపొతే పల్లవి..'ఛలియా' అనే పాత హిందీ చిత్రం లోని..'జరా సామ్నేతో ఆవో ఛలియే..ఛుప్ ఛుప్ చల్నేమే క్యా రాజ్ హై.. యూం ఛుప్ నా సకేగా పర్ మాత్ మా..మేరీ ఆత్ మా కీ ఏ ఆవాజ్ హై.." అనే ట్యూన్ లో కూర్చబడినది..
పాట మీకు నచ్చినందుకు..మరొక్కసారి ధన్యవాదాలు..
-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
కవితకన్నా మీ వివరణ ఇంకా బాగుంది :)
Post a Comment